అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలు సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగిందని ఎక్కువ శాతం ప్రజలు పింఛన్ ఇళ్ల నిర్మాణం విద్యుత్ సమస్యపై తన దృష్టికి తీసుకురావడం జరిగిందని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనేక సమస్యలు వస్తున్నాయని వీటిని పరిష్కరిస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.