కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి రెండు రోజుల జైలు, జరిమానా : ఎస్సై రంజిత్
కామారెడ్డి మండలం దేవునిపల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మద్యం సేవించి పట్టుబడిన కామారెడ్డికి చెందిన ప్రవీణ్ కుమార్ కు మంగళవారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి సెకండ్ క్లాస్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. మేజిస్ట్రేట్ విచారించి, డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితునికి రెండు రోజుల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టారీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రంజిత్ హెచ్చరించారు.