జహీరాబాద్: చిన్న హైదరాబాద్ లో పేకాట శిబిరం పై పోలీసుల దాడి, 5 మందిపై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని చిన్న హైదరాబాద్ లో పేకాట శిబిరంపై దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి ఐదు మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 17,470 నగదు ,పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట, జూదం ఆడిన నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.