బనగానపల్లె: భానుముక్కల గ్రామంలో ఓ వ్యక్తిని వేటకొడవలితో విచక్షణ రహితంగా దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి.
బనగానపల్లె పట్టణంలోని భానుముక్కల గ్రామంలో చాకలి శ్రీరాములు పై గుర్తుతెలియని వ్యక్తి వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై దుగ్గిరెడ్డి లు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీరాములును 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.