జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని, వచ్చిన ఫిర్యాదులు మళ్లీ మళ్లీ పునరావృత్తం కాకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ 8, ఇతర శాఖలు 14 ఫిర్యాదులు అందాయి