దళితులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం - KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి
Ongole Urban, Prakasam | Jul 12, 2025
సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం దళితులను తీవ్రంగా దగా చేస్తుందని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి దుయ్య బట్టారు. శనివారం నాడు ఆయన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురామ్, రాష్ట్ర కమిటి సభ్యులు అట్లూరి రాఘవులు,జిల్లా ఉపాధ్యక్షులు వి మోజెస్ తో కలసి స్థానిక ఎల్ బిజి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా ఎస్సీలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పధకాన్ని కూటమి ప్రభుత్వం నీరు గారుస్తుందని ఆరోపించారు. ఎస్సీలకు 200 యూనిట్లు వరకు అందించే ఉచిత విద్యుత్ ఒంగోలులో అమలు కావడం లేదన్నారు