రాప్తాడు: విజయనగర్ కాలనీ వద్ద ఏపీఐఐసీ ప్రాంగణంలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని విజయనగర్ కాలనీ వద్ద ఉన్న సిరికల్చర్ ప్రాంగణంలో మంగళవారం 10 గంటల 45 నిమిషాల సమయంలో ఏపీఐఐసీ సంబంధించిన ఫ్లాట్టేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సిరికల్చర్ ప్రాంగణం నందు ప్లాట్టేడ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ ఫ్యాక్టరీ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.