కర్నూలు: లోపాలు లేకుండా ఓటర్ల జాబితా పరిశీలన : కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితా డేటాను 2025 డేటాతో సరిపోల్చే టేబుల్ టాప్ వ్యాయామాన్ని లోపాలు లేకుండా పూర్తి చేయాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్వోలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ – 2025 కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2025 కోసం ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ 2002, 2025 ఓటర్ల జాబితాలను సమగ్రంగా పరిశీలించి డేటా మ్యాపింగ్ చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో