తాడిపత్రి: తాడిపత్రిలోని వైసీపీ నేతలతో కలిసి ప్రజా ఉద్యమ వాల్ పోస్టర్లను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్లను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విడుదల చేశారు తాడిపత్రిలోని తన నివాసంలో వైసీపీ నేతలతో కలిసి ప్రజా ఉద్యమ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు పేదలకు వైద్యం అందించడమే కాకుండా మెడిసిన్ అందించేలా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు.