కామారెడ్డి: భారత ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
కామారెడ్డి : భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు రక్త దానం చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా దేశానికి ప్రధానిగా, అంతకు ముందు గుజరాత్ రాష్ట్రనికి ముఖ్య మంత్రిగా ఎనలేని సేవలు చేస్తూ భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతున్న మోదీ ఆయురాగ్యాలతో నిండు నూరేళ్లు ఈ దేశానికి సేవ చేయాలని ఆయనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త దేశ సేవలో పునరంకితం కావాలని కోరడం జరిగింది.