ఒంగోలు అర్బన్: డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో నిరసన ధర్నా
Ongole Urban, Prakasam | May 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో సోమవారం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలంటూ నిరసన ధర్నా చేపట్టారు అంబేద్కర్ భవనం వద్ద నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీని వినూత్నంగా నిర్వహించారు డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైకులను నెట్టుకుంటూ ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డిఓను కలిసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు అనంతరం పోలీసుల అనుమతితో ముఖ్యమైన నేతలు వెళ్లి ఆర్డిఓ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.