ఆళ్లగడ్డ: ఓబులపల్లె గ్రామంలో ఎంపీ లాన్స్ జెడ్పి నిధులు కలిపి,20 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఓబుల పల్లె గ్రామంలో ఎంపీ లాండ్స్ జెడ్పీ నిధులు కలిపి 20 లక్షలతో అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకరం చుట్టారు, టిడిపి నేత గౌరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పెషల్ ఆఫీసర్ మహేంద్ర,సెక్రెటరీ బాలవర్ధి రాజు పాల్గొని టెంకాయ కొట్టి భూమి పూజ చేసి ప్రారంభించారు, ప్రభుత్వ నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరు వెంకట రామిరెడ్డి, మోహన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు