ఆళ్లగడ్డ: సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు
సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆళ్లగడ్డ డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు, పట్టణ శివారులోని తిట్టుకో గృహాల వద్ద శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆపరిచితులతో పరిచయాలు పెంచుకోవద్దన్నారు, వ్యక్తిగత వివరాలు ఫోటోలు షేర్ చేయవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పీరయ్య శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు