కనిగిరి: ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
. కనిగిరి పట్టణంలోని చింతలపాలెంలో స్వస్త్ నారి.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని, మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తుందని, వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.