బనగానపల్లె: కనకాద్రిపల్లెలో రాంకో సిమెంట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లెలో రాంకో సిమెంట్ వారి ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన 250 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. రాంకో వైద్యులు డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది దీర్ఘకాలిక రోగులతో పాటు, ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.రాంకో CSR మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.