ఖైరతాబాద్: నగరంలో కుండపోత వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సికింద్రాబాద్, నాచారం, అల్వాల్, పంజాగుట్ట, ఉప్పల్, హబ్సిగూడ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. దీంతో రోడ్లపై భారీగా నీరు చేరింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు