మోతే: అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి : మోతె పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా ఎస్పీ నరసింహ
మోతె మండలం లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం మండల కేంద్రం లో పోలీస్ స్టేషన్లో తనిఖీలలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ మోతె పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీ, రిషప్షెన్ రిజిష్టర్ ని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, పిర్యాదుల తీరుతెన్నులు, కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు.