కర్నూలు: ప్రభుత్వ ఏబీసీ క్యాంపుల భూముల పరిరక్షణ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం : ప్రజా పరిరక్షణ సమితి నాయకులు డేవిడ్
ప్రభుత్వ ఏబీసీ క్యాంపుల భూములను పరిరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు డేవిడ్ తెలిపారు. మంగళవారం కర్నూలులో సిపిఐ సిపిఎం ఎస్డిపిఐ వైసిపి రాయలసీమ పరిరక్షణ సమితి రాయలసీమ విద్యార్థి సంఘాలతోఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ బి సి ప్రభుత్వ క్వాటర్స్ లో పేదలు జీవిస్తూ ఉంటే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఏ బి సి క్యాంపులో ప్రభుత్వ స్థలాలను రక్షించడంతోపాటు ఏబిసి క్యాంపుల్లో రాష్ట్ర హైకోర్టు, లోకయుక్త,