చిల్లకూరు మండలం చింతవరం సీఐటీయూ ఆటో స్టాండ్ కార్మికుడి ఆటోలో బుధవారం కొత్తపాలెంకి చెందిన సుబ్బమ్మ గూడూరుకు వచ్చేందుకు ఎక్కారు. అదే సమయంలో మరొక ఆటో రావడంతో ఆ ఆటో నుంచి సుబ్బమ్మ దిగిపోయారు. కంగారులో రూ.4 లక్షల విలువైన బంగారు కడియం ఉన్న బ్యాగ్ను ఆటోలోనే వదిలేశారు. ఆటో డ్రైవర్ శ్రీనివాసులు ఆ బ్యాగ్ను గుర్తించి సుబ్బమ్మకు అందించి తన నిజాయితీని చాటుకున్నారు.