సంగారెడ్డి: అంబేద్కర్ మైదానంలో ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అయిన మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు నిర్వాహకులు పాల్గొన్నారు.