రాజమండ్రి కి చెందిన బాలుడు బాపట్ల రైల్వేస్టేషన్ లో ప్రత్యక్షం, తల్లిని పిలిపించి సురక్షితంగా అప్పగించిన అధికారులు
బాపట్ల రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం సంచరిస్తున్న 14 ఏళ్ల బాలుడిని ఆర్.పి.ఎఫ్ సి.ఐ మనోజ్ కుమార్ గుర్తించి జిల్లా బాలల సంరక్షణ అధికారి పురుషోత్తం కు సమాచారం అందించారు.ఆయన అ బాలుడిని సంరక్షణ గృహానికి తరలించి తల్లిదండ్రుల వివరాలు సేకరించి రాజమండ్రిలో ఉంటున్న వారికి సమాచారం ఇచ్చారు. దీంతో బుధవారం ఉదయం ఆ బాలుడి తల్లి బాపట్ల చేరుకోగా ఆమెకు అప్పగించారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.వారికి ఆ తల్లి కృతజ్ఞతలు తెలిపారు.