ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం క్షేత్రానికి నూతన శోభ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో సరికొత్త అందాలను సంతరించుకుంది, ఆళ్లగడ్డ మార్గంలో రోడ్డు నిర్మాణం, పంచాయతీ పరిధిలో డివైడర్లు, బటర్ ఫ్లై వీధి దీపాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడు తోంది, పర్యాటకపరంగా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆమె పనులు చేపట్టారు, మార్పుల పట్ల భక్తులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులను కొనియాడారు