డోన్: బేతంచర్ల లో విద్యార్థులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు
Dhone, Nandyal | Jun 12, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్సాహంగా పాఠశాలలకు తీసుకువచ్చారు. పట్టణంలోని మెయిన్ స్కూల్ హెచ్ఎం పాపారాయుడు, ఉపాధ్యా యులు దానమయ్య, రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూలగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు ఉదయం ప్రార్థన ముగించుకుని, క్రమశిక్షణతో తమ తరగతి గదుల్లోకి వెళ్లారు