ఎల్లారెడ్డి: కాంగ్రెస్ కి తెలిసొచ్చేలా భాజపా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహిస్తాం : రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి
ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన సర్కార్, అధికారం వచ్చాక విస్మరించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎల్లారెడ్డి బీజేపీ ఆఫీస్ లో గోడప్రతులను ఆవిష్కరించిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ సంబరాలు నిర్వహిస్తామని, ఆ రోజు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని తెలిపారు.