విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలి: పాడేరు మండలంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
రాబోయే పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ విద్యార్థులకు సూచించారు. సోమవారం పాడేరు మండలం కందమామిడి గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. గతంలో కంటే ఈ సంవత్సరం అందరూ మంచి మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సబ్జెక్ట్ పరంగా డౌట్ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.