చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు: బనగానపల్లె ఎస్సై దుగ్గి రెడ్డి
రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని బనగానపల్లె ఎస్సై హెచ్చరించారు. ఆదివారం బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామన్నారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.