డోన్: చట్టాలు తప్పనిసరిగా పాటించాలి :డోన్ పశు వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు
Dhone, Nandyal | May 25, 2026 నంద్యాల జిల్లా డోన్లో బక్రీద్ పండుగను ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా జరుపుకోవాలని పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు సూచించారు.సోమవారం రైల్వే మోతి మసీద్లో ఆయన మాట్లాడారు. ఈనెల 28న బక్రీద్ సందర్భంగా చట్టాలను పాటించాలన్నారు. రాష్ట్రంలో మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి జంతువుల వధకు అనుమతి ఉన్నా.. ఆవులు, దూడలు, ఒంటెల వధ పూర్తిగా నిషేధమన్నారు. గోవధ లేదా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు