అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టే ప్రజా ఉద్యమం పోస్టర్లను పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దుర్మార్గ చర్యలపై ప్రజల పక్షాన వైయస్సార్సీపి ప్రజా ఉద్యమం చేపట్టిందని ఈసందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.