జహీరాబాద్: ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి తొమ్మిది రోజులపాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జహీరాబాద్ పట్టణంలో ఎక్కిల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించి ఘట పూజలు చేపట్టారు. జరా సంఘం కేతకి ఆలయంలో అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు.