కనిగిరి పట్టణంలోని 1,5,11 వార్డులలో రూ .70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తో కలిసి బుధవారం శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ... కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో... సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేని 2,5,11 వార్డులలో వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.