సిర్పూర్ టి: కాగజ్ నగర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనం నుండి 2.25 లక్షల నగదు అపహరణ, కేసు నమోదు
కాగజ్నగర్ పట్టణంలోనూ బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనంలో రెండు లక్షల 25 వేల రూపాయల నగదు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న కాగజ్నగర్ పట్టణ పోలీసులు సిసిటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,