గుంతకల్లు: మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని ములకల పెంట గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో శనివారం జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామని అన్నారు.