అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప, శ్రీరంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం 97% పూర్తి చేశామని వైద్యాధికారులు ప్రియాంక రవిశంకర్‌లు పేర్కొన్నారు. మండలంలో మొత్తం 4867 మంది చిన్నారులకు గాను 4698 మంది చిన్నారులకు పోలియో నివారణ వ్యాక్సిన్ చుక్కలను వేయడం తో 97% పూర్తి చేయడం జరిగిందని వైద్యాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.