ఉరవకొండ: కమ్మూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లను పరిశీలన చేసిన ప్రాజెక్ట్ సీడీపీఓ బి.ఎన్ శ్రీదేవి
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కమ్మూరు గ్రామంలోని 1,2 అంగన్వాడీ సెంటర్ లను ప్రాజెక్ట్ సీడీపీఓ బి.ఎన్ శ్రీదేవి బుధవారం విజిట్ చేసారు. తల్లిదండ్రులకు పోస్టల్ ద్వారా మీ బిడ్డ బరువు ఉంటే ఇలా ఉంటాడు బరువు తక్కువగా ఉంటే ఇలా ఉంటాడని తల్లిదండ్రులకు అవగాహన ఇవ్వడం జరిగినది. పిల్లలను వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండాలని, బాల్య వివాహాల గురించి, డ్రాప్ చిల్డ్రన్స్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారుల తల్లిదండ్రులకు పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. గర్భవతులు హౌస్ విజిట్ కి వెళ్లి ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవాలి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు.