నంద్యాల అర్బన్: తనకు సొంత ఇల్లు కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు నంద్యాల బిజెపి నాయకులకు వినతి
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
నంద్యాలలోని బీజేపీ కార్యాలయం వద్ద జనతా వారధి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్థానిక జగజ్జనని నగర్కు చెందిన దివ్యాంగుడు మహేశ్ తనకు సొంత గృహం లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తనకు ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. దివ్యాంగుడి అభ్యర్థన మేరకు తనకు సొంత గృహాన్ని మంజూరు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని నాయకులు హామీ ఇచ్చారు.