డోన్: క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 17, 2026 ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం డోన్ టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతులు డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి వసతుల కల్పనకు కృషి చేయాలని అన్నారు