అనంతపురం నగర శివారులోని ఇటుకలపల్లి హైవే సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఓ యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం నగర శివారులోని ఇటుకలపల్లి హైవే సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వైయస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన సుదర్శన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.