యాగంటిలో వైభవంగా కార్తీక లక్ష దీపోత్సవం, దీపోత్సవంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ సతీమణి శ్రీమతి ఇందిరమ్మ
బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో శుక్రవారం పవిత్ర కార్తీక మాసోత్సవంలో భాగంగా వచ్చే కార్తీక పౌర్ణమి వేడుకలను ఆత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్దపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖామాత్యులు బీసీ జనార్ధనరెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇందిరమ్మ యాగంటి క్షేత్రానికి విచ్చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.