చిత్తూరు: సప్త కనికమ్మల ఆలయంలో పూజలు చిత్తూరులోని ప్రసిద్ధ సప్త కనికమ్మల ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే జగన్మోహన్ తండ్రి చెన్నకేశవుల నాయుడు ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు దర్శన అనంతరం ఆయనను సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం6 గంటలకు లక్షద్వీప అర్చనలు చేసి దీపాలను వెలిగించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారులు మహిళల దీపాలను వెలిగించారు