చింతలపూడిలో, రూ.32 లక్షల నిధులతో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభించిన రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్
కొయ్యూరు మండలంలోని చింతలపూడి పంచాయతీకి రూ.32 లక్షల నిధులతో నూతన పంచాయతీ భవనం మంజూరైందని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం చింతలపూడి పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ సెగ్గే రమాదేవితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి, భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు జీవం పోస్తుందని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.