నంద్యాల అర్బన్: నంద్యాలలో జిల్లా స్థాయి యోగ పోటీలు
Nandyal Urban, Nandyal | Jun 14, 2026
నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి యోగా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు దామోదర్ రెడ్డి, లక్ష్మీదేవి, డాక్టర్ రామకృష్ణ, దీప్తి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇందులో గెలుపొందిన వారు ఈ నెల 18 నుంచి 20 వరకు అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నోడల్ ఆఫీసర్ శ్రీవాణి తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు సీఎం చేతుల మీదుగా బహుమతులు అందుకుంటారని ఆమె పేర్కొన్నారు.