పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో గాయపడిన హేమలతను పరామర్శించిన జనసేన నాయకులు, డాక్టర్ వివరణ
పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో గాయపడిన హేమలత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జనసేన నాయకులు పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు కాన్వాయ్ తనను ఢీకొనలేదు ఆ తోపులాటలో కిందపడి జనాలు తన కాలును తొక్కేశారని ఆమె తెలిపారు. అనంతరం జనసేన పార్టీ తరఫున జిల్లా కార్యదర్శి పూల చైతు హేమలతకు ఆర్థిక సహాయం అందించారు. వినోద్ మాట్లాడుతూ, నిన్నటి దినం జనసేన అధినేత కారు హేమలత కాలు పైన ఎక్కి వెళ్లిపోయిందని ఎవరో చెప్తే అది మీడియా ముందు మాట్లాడాను. అది తప్పని తెలిసింది దీనిని అలుసుగా తీసుకొని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు.