డోన్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డోన్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన
Dhone, Nandyal | May 19, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటే వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు డోన్ పట్టణంలో అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో గాంధీ విగ్రహం వరకు తాడు సాయంతో లాగుతూ నిరసన చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర కింద 50 వేల రూపాయలను అందజేయాలని కోరారు. ఆటో డ్రైవర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు