చెన్నూరు: సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోని గుర్తింపు సంఘం: ఐఎన్టియుసి నాయకులు
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి కార్మిక పక్షాన నిలబడి యాజమాన్యాన్నీ ఒప్పించే బాధ్యతగల గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించి వేలాది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని ఐఎన్టియుసి నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నికల్లో మెజార్టీ కార్మికులు ఓటు వేసి ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నారని తెలిపారు.