డోన్: నేటి నుంచి స్కూల్లకు సెలవులు ప్రకటించడంతో డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇంటికి బయలుదేరిన విద్యార్థులు
Dhone, Nandyal | Apr 23, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం లోని డోను, బేతంచెర్ల,ప్యాపిలి బేతంచెర్ల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట తరగతులు ముగియడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ మోడల్ స్కూల్, ఎంజేపీ, కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాల విద్యార్థులు గురువారం తమ సొంత గ్రామాలకు బయలుదేరారు.సెలవుల ప్రకటనతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తూ తమ తోటి మిత్రులకు విద్యార్థులు సంతోషంగా వీడ్కోలు పలికారు.