సికింద్రాబాద్ పార్లమెంట్ TDP అధ్యక్షుడు సాయిబాబా ఆకస్మిక మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బేగంపేట భగవంతాపూర్లోని సాయిబాబా నివాసానికి వెళ్లిన తలసాని, పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.