తెనాలి: తెనాలి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి నిరసన
Tenali, Guntur | Aug 12, 2025 గుంటూరు జిల్లా తెనాలిలో టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతి, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రెండవ రోజు నిరసన తెలిపారు. ఖాతాదారులకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవద్దని, ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు తన దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ నిరసన తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కొనసాగుతోంది. కస్టమర్ సర్వీస్ సెంటర్ ను ప్రైవేట్ వ్యక్తులు కు కేటాయించడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.