రాజేంద్రనగర్: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం బోల్తా
గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి సమీపంలో అశోక్ లేలాండ్ వాహనం టైరు పేలడంతో బోల్తా పడింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని కోరారు.