నాంపల్లి: నాంపల్లి మండలం నేరెళ్లపల్లిలో భూ తగాదాలు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నేరెళ్లపల్లిలో భూతగాదాలు హింసాత్మకంగా మారాయి. కొన్నేళ్లుగా వ్యవసాయ భూముల విషయంలో ముక్కుమల్ల సత్తయ్య నరసింహ వెంకన్నకు వివాదం ఉండగా శనివారం ఉదయం కర్రలతో దాడి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనలో సత్తయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు .పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్న వివాదం సద్దుమనగకపోగా కక్ష పెంచుకొని ఒకరికొకరు వర్గాలు దాడి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.