సంగారెడ్డి: సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను వేగంగా పూర్తి చేయాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను వేగంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిఎస్ఆర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నిధులు ప్రతి పరిశ్రమ సామాజిక బాధ్యతతో భాగంగా రెండు శాతం నిధులు కేటాయించాలని సూచించారు. సి ఎస్ ఆర్ నిధులతో జిల్లాలో చేపట్టే పనులను వేగంగా పూర్తి చేసి అమల్లోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.